బిజెపి జాతీయ అధ్యక్షులు, జె. పి. నడ్డా సూచనల మేరకు దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న మన మట్టి మన దేశం కార్యక్రమంలో దేశ ప్రజలందరూ భాగస్వాములు కావాలని బిజేపి జిల్లా ఉపాధ్యక్షురాలు, కొనతల మణెమ్మ అన్నారు. శుక్రవారం నరసన్నపేట పల్లిపేట జంక్షన్లో మన మట్టి-మన దేశం కార్యక్రమంలో భాగంగా మట్టిని సేకరించి, కలశంలో వేసారు. అలాగే హరిశ్చంద్రపురంలో మన మట్టి మన దేశం కార్యక్రమం నిర్వహించారు.