దివంగత మహానేత వైఎస్ వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ భావోద్వేగంగా స్పందించారు. ‘నాన్నా.. మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది’ అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ‘భౌతికంగా మా మధ్య లేకపోయినా, ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే లీడర్ మీరు. మీ ఆశయాలే నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయి.’ అంటూ ట్విటర్ లో జగన్ పేర్కొన్నారు.