తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు మేరుగ నాగార్జున, జోగి రమేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. అలాగే పేదలకు దుస్తులు పంపిణీ చేశారు.