చంద్రబాబు పాపం పండిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.చంద్రబాబు అధికారంలో ఉండగా ఏ విధంగా అవినీతికి పాల్పడ్డాడో.. ఆయన అనుసరించిన అవినీతి మార్గాలేంటనేది ఐటీ శాఖ నోటీసుల ద్వారా బయటపడింది. వాటిపై చంద్రబాబు ఇచ్చిన సమాధానాల్ని కూడా ఐటీ శాఖ రిజెక్ట్ చేసిన సంగతి ఈరోజు హిందూస్థాన్ టైమ్స్ వెలుగులోకి తెచ్చింది. మరి, ఇదే చంద్రబాబు అవినీతిపై గతంలో ఏం మాట్లాడాడు.? నేను సత్యహరిశ్చంద్రుడ్ని. అవినీతి అంటేనే నాకు తెలియదు. అవినీతి డబ్బంటే ఏంటో కూడా తెలియదంటూ చిలుకపలుకులు పలికాడు. ఇప్పుడు ఐటీశాఖ అధికారులేమో చంద్రబాబు అవినీతి చక్రవర్తి అని తేల్చేశారని చెప్పారు.