ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర ప్రతినిధులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వైయస్ జగన్ ప్రభుత్వం వీఆర్‌ఏలకు రూ. 500 డీఏ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో వీఆర్ఏల సంఘం ప్రతినిధులు సీఎం వైయస్ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తమకు గత ప్రభుత్వం డీఏ రద్దు చేసిందని, అప్పట్లో ఇచ్చే డీఏ రూ. 300 కూడా రద్దు చేయడంతో తమ ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో వైయస్ జగన్ తమకు న్యాయం చేశారని వీఆర్‌ఏల సంఘం ప్రతినిధులు చెప్పారు. ఈ నిర్ణయం వల్ల 23 వేల మంది వీఆర్‌ఏలకు లబ్ధి జరుగుతుందని సీఎంకి వివరించి తమ ఆనందాన్ని ముఖ్యమంత్రితో పంచుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన వారిలో గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షడు గరికపాటి బ్రహ్మయ్య, ఉపాధ్యక్షులు జి.టి.రామాంజనేయులు, బి.వెంకట్రావు, పి.రాంబాబు, కోశాధికారి చెన్నుపల్లి సత్యనారాయణ ఉన్నారు.