హిందూస్తాన్ టైమ్స్ చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేసిందని, ఈ కథనంపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ నాయకులు పేర్ని నాని ప్రశ్నించారు. దమ్ముంటే ఐటీ నోటీసులపై చంద్రబాబు నోరు విప్పాలని ఆయన సవాలు చేశారు. అమరావతి పేరుతో డబ్బులు కొట్టేసింది నిజమా? కాదా? అని నిలదీశారు. 2016 లో చంద్రబాబు ఇన్‌ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్‌లతో 118 కోట్లు ముడుపులు తీసుకున్నారు. తన పీఏ శ్రీనివాస్ ద్వారా చంద్రబాబు ముడుపులు తీసుకున్నారు. రాజధాని అమరావతి పేరుతో దోపిడీ జరిగిందని విమర్శించారు. ఈ ముడుపుల బాగోతంపై ఐటీ నోటీసులు ఇచ్చింది. చంద్రబాబుకు మనోజ్ పార్థసాని ముడుపులు ఇచ్చినట్టు తేలింది. ఈ ముడుపులను దాచి ఉంచిన ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదని నోటీసులో పేర్కొన్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్‌జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ వెళ్లినప్పుడల్లా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులపై ఎల్లో మీడియా ఎందుకు స్పందించదు?. ప్రధానులు, రాష్ట్రపతులను మార్చిన చంద్రబాబుకు ఐటీ నోటీసులిస్తే రాయాలిగా?. హిందుస్తాన్ టైమ్స్‌లో వచ్చిన కథనం వీరెవ్వరికీ కనిపించదా అని ప్రశ్నించారు.