ఈ ఏడాది వర్జీనియా పొగాకుకు రికార్డు స్థాయిలో ధర పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ఉమ్మడి ప.గో జిల్లాలోని 5 వర్జీనియా పొగాకు వేలం కేంద్రాల్లో వేలం దశల వారీగా ముగిసింది. ఈ ఏడాది కేజీ రూ.248 పలికింది. గతేడాది ఈ ధర రూ.191.72 గా ఉంది. మొత్తం రూ.1,422.53 కోట్ల విలువైన పొగాకు అమ్మకాలు జరిగాయి. ఉత్తర ప్రాంత తేలిక నేలల్లో పండే వర్జీనియాకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa