వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ ఓ మహిళపై స్థానికులు దాడి చేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాళ్‌లోని ఉత్తర్ దినాజ్‌పుర్ జిల్లాలో చోటు చేసుకుంది. కురందీఘీ బ్లాక్‌లో నివాసముంటున్న ఓ మహిళపై స్థానికులు దాడి చేశారు. ఆమె జడను కత్తిరించి రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. కొందరు వ్యక్తులు ఆమెను రక్షించి వైద్యం కోసం రాయ్‌గంజ్ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.