చంద్రయాన్–3 మిషన్‌లో భాగంగా ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై తన కార్యాచరణను పూర్తి చేసిందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రుడి ఉపరితలంపై రాత్రిళ్లు ఉండే అతిశీతల పరిస్థితులను తట్టుకుని ఉండేలా ప్రజ్ఞాన్ రోవర్‌ను స్లీప్ మోడ్‌లోకి పంపినట్లు శనివారం వెల్లడించారు. రోవర్‌లోని డేటా.. ల్యాండర్ ద్వారా ఇప్పటికే తమకు చేరిందని పేర్కొన్నారు.