భారత ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 6, 7 తేదీల్లో ఇండోనేషియాలో పర్యటించనున్నారు. అక్కడ జరిగే ఏషియాన్, ఈస్ట్ ఆసియా సదస్సుల్లో పాల్గొననున్నారు. రాజధాని జకార్తాలో జరిగే ఈ సమావేశాలకు ఏషియాన్ చైర్ హోదాలో ఇండోనేషియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఏషియాన్లోని సభ్యదేశాలతో వ్యాపార, భద్రతా సంబంధాల బలోపేతంపై ప్రధాని మోదీ దృష్టి సారించనున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది.