అప్రకటిత విద్యుత్ కోతలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కొవ్వొత్తులతో ర్యాలీ శనివారం రాత్రి గజపతినగరంలో నిర్వహించారు. గజపతినగరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలపై ధరల భారం మోపడంతో పాటు విద్యుత్ కోతలు వాతలతో ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్న వైకాపా ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa