ఐటీ నోటీసులపై చంద్రబాబు నోరు తెరవడం లేదంటే తప్పు ఒప్పుకున్నట్లే అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏం మాట్లాడినా ఎల్లో మీడియా ఆణిముత్యాలు ఏరుకుంటోంది. పచ్చి అబద్దాలను వండి వారుస్తోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవినీతి బాగోతాన్ని బయటపెట్టిన జాతీయ మీడియాపై నారా లోకేశ్ ఎందుకు పరువు నష్టం దావా వేయలేదు అని ప్రశ్నించారు. భారత ప్రభుత్వం ఆధీనంలో నడిచే సంస్థ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చింది. చంద్రబాబు ఓ గజదొంగ. అవినీతిలో పక్కా ఆధారాలతో చంద్రబాబు దొరికిపోయాడు. కోర్టులను అడ్డుపెట్టుకుని దర్యాప్తులను ఆపుకోవడం బాబుకు అలవాటే. షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు ముడుపులు చేరాయి. చిన్న చిన్న ఆరోపణలకే పరువు నష్టం దావా వేసిన లోకేశ్.. చంద్రబాబు అవినీతి బాగోతాన్ని బయటపెట్టిన జాతీయ మీడియాపై పరువు నష్టం దావా ఎందుకు వేయలేదని ప్రశ్నించారు.