ఐటీ నోటీసులపై ‘నారా’ వారు నోరిప్పరేమని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రశ్నించారు. చంద్రబాబు నీతి కబుర్లు చెబుతుంటాడని.. ఆయనకు ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చాయని.. అయినా ఇంత వరకూ చంద్రబాబు ఎందుకు నోరు విప్పటం లేదని మంత్రి ప్రశ్నించారు. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి పనికి మాలిన పనులు అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు జీవితం అంతా స్టే తెచ్చుకోవటమేనని.. సింగిల్‌గా పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు ఊసరవెల్లి స్వభావం బీజేపీ నేతలకు తెలుసని ఆయన విమర్శించారు. నోటీసుల విషయంలో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణం అయిన ఉసురు చంద్రబాబును వెంటాడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.