చంద్రబాబు అవినీతి బండారం బయటపడిందని, ఆయన అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరపాలి వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ముడుపులపై ఐటీ పూర్తి ఆధారాలతో నోటీసులు ఇచ్చిందని, ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. నోటీసులపై చంద్రబాబు అభ్యంతరాలను ఐటీ శాఖ తోసిపుచ్చింది. ఐటీకి లేఖలు రాసారే తప్ప ఆరోపణలను చంద్రబాబు ఖండించలేదు. ముడుపులు తీసుకోలేదని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారు?. మనోజ్ వాసుదేవ్ పార్థసాని చెప్పిన విషయాలపై ఎందుకు మాట్లాడరు?. నోటీసులు ఎవరు ఇవ్వాలో కూడా చంద్రబాబే చెబుతారా? అంటూ ఎమ్మెల్సీ డొక్కా దుయ్యబట్టారు.