చంద్రబాబు పరిస్థితి ఒలింపిక్స్‌లో మెడల్కొట్టి, డోపింగ్‌లో దొరికినట్లయ్యిందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ‘ చంద్రబాబుకు ఐటీశాఖ నోటీసులిచ్చింది. లెక్కల్లో చూపని రూ. 118 కోట్లకు చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులిచ్చింది. బాబుకు ఐటీ నోటీసులపై రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్నాయుడు స్పందించరు. బాబు తప్పుల గురించి వారు ప్రజలకు తెలపరు. అమరావతి అనే మాయా ప్రపంచాన్ని చంద్రబాబు సృష్టించారు. అమరావతిలో ఇతురులెవరూ భూమి కొనుగోలు చేయకుండా చట్టం సృష్టించాడు బాబు. చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నారని ప్రధానే చెప్పారు’ అని మంత్రి అప్పలరాజు మరోసారి గుర్తుచేశారు.