టీడీపీ అధినేత చంద్రబాబు ఒక శాడిస్ట్ అంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. 2014-19 వరకూ వైయస్ఆర్ విగ్రహాలు పెట్టనివ్వకుండా చంద్రబాబు ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని, వైయస్ఆర్ ఫోటోను చూసినా చంద్రబాబు భయపడుతుంటారని ఎద్దేవా చేశారు వెల్లంపల్లి. ‘విజయవాడలో రాత్రికి రాత్రి 45 ఆలయాలను కూల్చేసిన దుర్మార్గుడు చంద్రబాబు. సీఎం జగన్ వచ్చాక ఆ ఆలయాన్నింటిని పునర్నిర్మిస్తున్నారు.చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకు వస్తుందా?, వైయస్ఆర్ కుటుంబం అంటే గుర్తొచ్చేది అభివృద్ధి సంక్షేమం. చంద్రబాబు అంటే అవినీతి వెన్నుపోటు’ అని వెల్లంపల్లి ధ్వజమెత్తారు.