టీడీపీ నేతల ముందస్తు బెయిల్ పై ఏపీ సర్కార్ తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇదిలావుంటే ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా అన్నమయ్య జిల్లా అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్త ఘటనలు చోటుచేసుకోవడం తెలిసిందే. ఈ కేసులో టీడీపీ నేతలు దేవినేని ఉమ, నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, చల్లా బాబు, పులివర్తి నానిలకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఒక్క చల్లా బాబుపైనే 7 కేసులు పెట్టగా, నాలుగు కేసుల్లో బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో, వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. టీడీపీ నేతలకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది.