మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు అని తప్ప ఎలాంటి ప్రత్యేక అర్హత లేని వ్యక్తి నారా లోకేశ్ వైసీపీ ఎంపీ మార్గాని భరత్ విమర్శలు గుప్పించారు. ముద్దపప్పు లోకేశ్.. బ్రాహ్మణి భర్తగా, బాలకృష్ణ అల్లుడిగా, చంద్రబాబు కొడుకుగా తప్ప ఇంకేం గుర్తింపు ఉందన్నారు. అలాంటి వ్యక్తి సీఎం జగన్ను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం విడ్డూరమన్నారు. లోకేశ్ కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేని వ్యక్తి అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవాలనుకునే నాయకులు పగటిపూట పాదయాత్ర చేస్తారని, కానీ లోకేశ్ మాత్రం అర్ధరాత్రి పాదయాత్ర చేస్తారని ఎద్దేవా చేశారు. తెల్లవారుజామున పాదయాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.