ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యాలపై భిన్నంగా స్పందించిన కాంగ్రెస్..శివసేన

national |  Suryaa Desk  | Published : Mon, Sep 04, 2023, 10:33 PM

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు తీవ్రచర్చ సాగుతోంది. ఇదిలావుంటే సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్చే సిన వివాదాస్పద వ్యాఖ్యల మీద కాంగ్రెస్, శివసేన (ఎంబీటీ) స్పందించాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ... అన్ని మతాలను గౌరవించడమే కాంగ్రెస్ స్వభావమని చెప్పారు. సర్వ ధర్మ సమభావన... కాంగ్రెస్ ఐడియాలజీ అని పేర్కొన్నారు. ప్రతి రాజకీయ పార్టీకి వాక్ స్వాతంత్య్రం ఉంటుందని, ఏ మతాన్ని కాంగ్రెస్ విమర్శించబోదన్నారు. 


I.N.D.I.A. కూటమిలో భాగమైన రాజ్యసభ ఎంపీ, శివసేన (యూబీటీ) నాయకురాలు ప్రియాంక చతుర్వేది కూడా వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించారు. సనాతన ధర్మం శాశ్వతమైన సత్యాన్ని సూచిస్తుందన్నారు. ఇది ఎన్నో ఆక్రమణదారుల దాడులను తట్టుకొని నిలబడగలిగిందని చెప్పారు. భారత దేశానికి సనాతన ధర్మమే పునాది అని, అలాంటి ధర్మంపై ఇలాంటి దారుణ వ్యాఖ్యలు సరికాదన్నారు. మరోపక్క, దీనిపై బీజేపీ స్పందిస్తూ.. ఉదయనిధి వ్యాఖ్యలతో I.N.D.I.A. కూటమి స్వభావం తేలిపోయిందని విమర్శలు గుప్పించింది. 







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com