సోషల్ మీడియా వచ్చాక ఎక్కడో జరిగిన అంశం యావత్తు ప్రపంచానికి తెలిసిపోతోంది. ఇదిలావుంటే బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో ఆసక్తికర వీడియో పంచుకున్నారు. ఆ వీడియోలో, ఓ బీజేపీ మహిళా ఎమ్మెల్యే, ఆమె భర్త రోడ్డు నిర్మాణ పనుల్లో పాలుపంచుకోవడాన్ని చూడొచ్చని వెల్లడించారు. "ఈ వీడియోలో కనిపిస్తున్న మహిళ పేరు చందనా బౌరి. ఆమె పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యే. ఆమె నియోజకవర్గంలో రోడ్డు నిర్మాణాన్ని తృణమూల్ ప్రభుత్వం అడ్డుకుంది. దాంతో, ఆమె తన భర్తతో కలిసి 200 మీటర్ల రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. స్వయంగా చెమటోడ్చి పనిచేశారు. ఆ రోడ్డు నిర్మాణానికి అయిన ఖర్చు కూడా వారిదే. తన ప్రజలకు సేవ చేయాలన్న ఆమె అచంచల అంకితభావానికి ఇది నిదర్శనం" అని విష్ణువర్ధన్ రెడ్డి కొనియాడారు.