గోగినేని భానుమతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజయ్ గోపాల్ ఆధ్వర్యంలో నూజివీడు పరిధిలోని గొల్లపల్లి గ్రామాభివృద్ధికి రూ.10.05 లక్షలు విరాళాన్ని అందించి వాటిని రహదారి నిర్మాణానికి ఉపయోగిస్తున్నామని తెలిపి రహదారికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గొల్లపల్లి సర్పంచ్ బి.వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ..... గ్రామాభివృద్ధికి గ్రామ ప్రముఖులు, వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన గ్రామస్థులు ముందుకు వచ్చి రహదారులు, డ్రైన్ నిర్మాణానికి చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa