కేంద్రం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలోని 62 తాలూకాలు లేదా బ్లాక్‌లను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటిస్తామని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర రెవెన్యూ మంత్రి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం కరువు పరిస్థితులపై సమీక్షించింది. పరిస్థితిపై ప్యానెల్ మూడు సమావేశాలు నిర్వహించింది.137 తాలూకాల్లో పంట నష్టంపై రీ సర్వే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, వారంలో సర్వే నివేదిక అందజేస్తామన్నారు. ఈ సంవత్సరం కర్ణాటకలో 27 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది మరియు 37 తాలూకాలు తాగునీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. అయితే ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సిద్ధమైందని చెప్పారు. కరువు ప్రకటించిన తర్వాత కరువు ప్రభావిత తాలూకాలకు సహాయం కోసం కేంద్రానికి మెమోరాండం అందజేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.