అస్సాం తింసుకియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు-కారు ఢీ కొన్న ఈ ఘటనలో ఏడుగురు మరణించగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి కాక్పత్తార్ సమీపంలో జరిగింది. వీరంతా వారాంతపు మార్కెట్కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa