ప్రీ స్కూల్ విధానం చట్ట విరుద్ధమని గుజరాత్ హైకోర్టు వ్యాఖ్యానించింది. మూడేళ్లలోపు చిన్నారులను స్కూల్‌కి బలవంతంగా పంపితే అది నేరంగా పరిగణించబడుతుందని మంగళవారం తీర్పు ఇచ్చింది. ఒకటవ తరగతిలో ప్రవేశానికి చిన్నారులకు ఆరేళ్లు ఉండాలని గుజరాత్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. దానిని హైకోర్టులో కొందరు పేరెంట్స్ సవాలు చేశారు. వారి పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించింది.