కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం రాత్రి యూరప్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. వారం రోజుల ఈ పర్యనటలో ఆయన న్యాయవాదులు, విద్యార్థులు, భారత సంతతివారితో సమావేశమవుతారు. ఈ నెల 7వ తేదీన బ్రసెల్స్, హేగ్లలో ఈయూ న్యాయవాదులతో భేటీ అవుతారు. 8న పారిస్లో విద్యార్థులతో సమావేశమవుతారు. 11న స్వదేశానికి తిరిగివస్తారు.