భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ రాత్రికి ఇండోనేషియా రాజధాని జకార్తాకు బయల్దేరి వెళ్లనున్నారు. గురువారం జరిగే ఏసియాన్, తూర్పు ఆసియా సదస్సుల్లో ఆయన పాల్గొంటారు. ఏషియాన్ లోని సభ్య దేశాలతో వ్యాపార, సముద్ర తీర భద్రత సహకారంపై ఈ సదస్సులో ముఖ్యంగా చర్చించనున్నారు. అనంతరం తిరిగి గురువారం సాయంత్రం ఇండియా కు చేరుకోనున్నారు.
ఆ దేశ రాజధాని జకార్తాలో జరిగే ఏసియాన్, తూర్పు ఆసియా సదస్సుల్లో గురువారం పాల్గొననున్నారు. ఈ కూటములలోని సభ్య దేశాలతో సముద్ర తీర భద్రత, వ్యాపార విషయాల్లో పరస్పర సహకారంపై ప్రధానంగా చర్చ సాగనుంది. సదస్సులో పాల్గొన్న తర్వాత ప్రధాని మోడీ తిరిగి గురువారం భారత్కు రానున్నారు. తర్వాత ఢిల్లీ వేదికగా జరిగే జీ20 సమావేశాల్లో పాల్గొననున్నారు.