పశ్చిమ గోదావరి జిల్లా బేతపూడి యువగళం క్యాంప్ సైట్‌పై అర్ధరాత్రి పోలీసుల దాడి చేసి వాలంటీర్లను అరెస్ట్ చేయడంపై ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. యువగళం పాదయాత్రకు రక్షణగా నిలుస్తున్న వాలంటీర్ల అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు. యువగళం శ్రేణులపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం సీఎం జగన్ సైకో తత్త్వానికి అద్దం పడుతోందన్నారు. పోలీసులపై ప్రైవేట్ కేసులు వేస్తామని తెలిపారు.