ప్రభుత్వం విద్యుత్తు చార్జీల పెంపుతో పాటు కోతలను విధిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని తెదేపా బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సుంకర వేణుగోపాల్ ఆరోపించారు. మంగళవారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇస్తామని సీఎం హామీ ఇచ్చి నెరవేర్చలేదని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సుదర్శన్, నాగసుబ్బరాయుడు పాల్గొన్నారు