ప్రభుత్వంపై దుష్ర్పచారం చేస్తున్న ఎల్లోమీడియా, ఎల్లో గ్యాంగ్‌పై సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేద్దామని, వారి కుట్రలను తిప్పికొట్టాలని వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా, మీడియా కో-ఆర్డినేటర్ సజ్జల భార్గవ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబుకు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, ఎల్లోమీడియా ఉందని హద్దు అదుపు లేకుండా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాలక్షేపానికి, మనసులో వున్న భావాలను పంచుకోవడానికి వచ్చిన సోషల్ మీడియా ఇప్పుడు మనిషి జీవితంలో భాగమైపోయిందన్నారు. వ్యక్తులను, వ్యవస్థలను, చివరికి దేశాలను సైతం ఇప్పుడు సోషల్ మీడియా శాసిస్తోందని చెప్పారు. ఎన్నెన్నో ఉద్యమాలకు, పోరాటాలకు సోషల్ మీడియా ఊపిరి పోసిందని తెలిపారు. ప్రభుత్వాలు సైతం సోషల్ మీడియా జోరుకు ముకుతాడు వేయాలని భావించి విఫలమవుతున్నాయన్నారు.