ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇసుక మాఫియా ని అడ్డుకున్న వైసీపీ నేతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 06, 2023, 01:48 PM

ఎన్టీఆర్ జిల్లా , ఇబ్రహీంపట్నంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను పొలీసుస్టేషన్‌కు వైసీపీ నాయకులు తరలించారు. ఇబ్రహీంపట్నం మండలం కోటికలపూడిలో ప్రభుత్వం నియమించిన జేపీ సంస్థ ఇసుక వ్యాపారం చేస్తోంది. నూజివీడు స్టాక్ పాయింట్‌కి తరలిస్తున్నట్లు చెప్పి ఇతర ప్రాంతాలకు ఇసుక తరలిస్తున్న జేపీ సంస్థ లారీలను వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. 20 టన్నుల లారీలకు 40 టన్నులు ఇసుకను పోసి అడ్డగోలుగా వ్యాపారం చేస్తున్నారని వైసీపీ నాయకులు వాపోయారు. కోటికలపూడి నుంచి ఇసుక లారీలు వస్తున్న విషయం అధికార పార్టీ నాయకులు తెలుసుకున్నారు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద లారీలను వైసీపీ నాయకులూ అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే 5 లారీలను పోలీసులు సీజ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com