సిపిఐ బస్సు యాత్రలో భాగంగా ధర్మవరం పట్టణంలో ఏర్పాటు చేసిన చేనేత సదస్సులో సిపిఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ.... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశాయన్నారు. ధర్మవరంలో పేరొందిన చేనేత రంగం నేడు ప్రభుత్వాల నిర్వాకం వల్ల కుదేలైందని మండిపడ్డారు. చేనేత సమస్యలపై ఎమ్మెల్యేలు, మంత్రులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. వారంలో రెండురోజులు ప్రభుత్వ ఉద్యోగులు చేనేత వస్త్రాలని ధరించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చేనేత సలహా బోర్డును పునరుద్ధరించాలని, ఆప్కోను పటిష్టం చేయాలని, మహాత్మాగాంధీ యోజనను అమలు చేయాలని డిమాండ్ చేశారు.