ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం నియోజకవర్గం బేతపూడి యువగళం క్యాంప్ సైట్ పై పోలీసులు దాడి చేశారు. 50 మందిని అరెస్ట్ చేసి కైకలూరు నియోజకవర్గం కలిదిండి పోలీస్ స్టేషన్కి పోలీసులు తరలించారు. అర్ధరాత్రి మూడు వ్యానుల్లో యువగళం క్యాంప్ సైట్ కి చేరుకున్న పోలీసులు.. వలంటీర్లు, కిచెన్ సిబ్బంది, క్యాంప్ ఏర్పాటు చేసే సిబ్బందితో సహా మొత్తం 50 మందిని అరెస్ట్ చేశారు. పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ దగ్గరుండి యువగళం పాదయాత్ర పై దాడి చేయించారని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు, నాయకులు కలిదిండి పోలీస్ స్టేషన్కి తరలి వస్తున్నారు.