విశాఖ ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్న వాసంశెట్టి రాంబాబు (60) మంగళవారం రాత్రి విధి నిర్వహణలో ఉండగా మెట్లపై జారిపడి మృతిచెందారు. వివరాల్లోకి వెళ్ళితే... కంచరపాలెం ప్రాంతానికి చెందిన రాంబాబు ఈఎండీ విభాగంలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం ఏ షిఫ్ట్‌లో విధులకు హాజరైన ఆయన విధి నిర్వహణలో భాగంగా గ్యాస్ క్లీనింగ్ కంట్రోల్ రూమ్‌కు వెళ్లేందుకు మెట్లు ఎక్కుతుండగా జారిపడిపోయారు. రాంబాబు తలకు తీవ్ర గాయాలు కావడంతో సహోద్యోగులు వెంటనే ఉక్కు జనరల్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రాంబాబు మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.