అనకాపల్లిని కరవు జిల్లాగా ప్రకటించాలని సంయుక్త కిసాన్‌మోర్చ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించి నష్టపోయిన రైతులు, కౌలుదారులను ఆదుకోవాలన్నారు. వరి ఆకుమడులు ఎండిపోయాయని, అక్కడక్కడా వేసిన వరినాట్లు కూడా ఎండకు మాడిపోయాయన్నారు. ప్రకృతి వైపరీత్యంతోపాటు గ్రోయిన్లు మరమ్మతులు చేయకపోవడం వల్ల రైతులు నష్టపోయారన్నారు. కౌలురైతులు తీవ్రంగా నష్టపోయి అప్పుల్లో కూరుకుపోయారన్నారు.