ఈనెల 25వ తేదీ లోపు ఓటర్ల సర్వేలో భాగంగా అన్ని దరఖాస్తులు అప్రూవల్ అయ్యేలా చర్యలు చేపట్టాలని కడప జిల్లా, మదనపల్లె ఆర్డీవో మురళి పేర్కొన్నారు. ఇంటింటా సర్వే ఒక కొలిక్కి వస్తోందని, ఇంకా ఏవైనా పెండింగ్ ఉంటే క్లియర్ చేసుకోవాలన్నారు. ఈ నెల ఏడో తేదీన మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి పోలింగ్ స్టేషనల వారీగా సమీక్షిస్తామన్నారు. ఒక పోలింగ్ స్టేషనలో 1445 పైగా ఓటర్లు ఉంటే ఆ పోలింగ్ స్టేషనను విభజించాలన్నారు. దీంతో పాటు ఆవాసాలకు 2 కిలోమీటర్ల దూరంలో పోలింగ్ స్టేషన వుంటే అటువంటి వాటిని కూడా మార్చాల్సి ఉందన్నారు. పోలింగ్ స్టేషనలలో ఓటర్లకు అన్ని సౌకర్యాలు ఉండేలా ఇప్పటి నుంచే పరిశీలించి నివేదికలు పంపాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa