‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ ’ పేరిట రాష్ట్రపతి నుంచి ఆహ్వానాలు రావడంతో దేశం పేరుపై రాజకీయ వివాదం మొదలైంది. దీనిపై తాజాగా ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధి ఫర్హాన్ హక్ కూడా స్పందించారు. తమ పేర్ల మార్పుపై దేశాల నుంచి అభ్యర్థనలు వస్తే వాటిని ఐక్యరాజ్యసమితి స్వీకరించి పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. గతంలో టర్కీ తన పేరును తుర్కియేగా మార్చుకున్న విషయాన్ని గుర్తుచేశారు.