ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సహకరించాలని కోరుతూ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు ఎమ్మార్పీఎస్ రాగిపట్టు రాఘవయ్య బుధవారం వినతిపత్రం సమర్పించారు. ఈనెల 18 నుండి 22 వరకు జరిగే పార్లమెంటు సమావేశాలలో ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపడం కోసం బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించాలని కోరారు. రాష్ట్రం నుండి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి మద్దతు తెలపాలని వినతి పత్రంలో కోరారు.