జీ-20 సదస్సు నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఈ నెల 9 నుంచి 10వ తేదీల్లో ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జీ-20 సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా తదితర దేశాల నుంచి ప్రముఖులు భారత్‌కు రానున్నారు. దాంతో ఢిల్లీలో భారీ ఆంక్షలు విధించారు. ఢిల్లీ సరిహద్దుల నుంచి రాకపోకలు నిలిపివేశారు. నగర రోడ్లపై లక్షల మంది పోలీసులు పహారా కాస్తున్నారు.