విజయవాడ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం చేపట్టిన రెండు విడతల కౌన్సిలింగ్ ప్రక్రియను రద్దు చేసిన క్రమంలో తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. రాజమహేంద్రవరం జీఎల్‌ఎల్ వైద్య కళాశాలలో ఎండీ రేడియో డయాగ్నోసిస్ (14 సీట్లు), ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో (2 సీట్ల) నకిలీ సీట్లను తొలగించి సీట్ మ్యాట్రిక్స్‌ను విశ్వవిద్యాలయం సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా కింద అభ్యర్థులు శుక్రవారం 11 గంటల్లోగా వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు.