మోపిదేవిలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రముఖ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగ శాస్త్రి శుక్రవారం దర్శించుకున్నారు. దేవస్థానానికి వచ్చిన రామలింగ శాస్త్రి ఆలయ ఆవరణలో గల నాగ పుట్టలో పాలు పోసి మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకొనగా ఆలయ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.