సింపతీ కోసం చంద్రబాబు పడుతున్న పాట్లను వైయస్ఆర్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ వి.విజయసాయిరెడ్డి ఎండగట్టారు. రేపో మాపో తనను అరెస్ట్ చేస్తారంటూ సానుభూతి డ్రామాలాడుతున్నారు చంద్రబాబు గారు. తన భార్యను అవమానించారంటూ గతంలో గుక్కపెట్టారు. ఎన్నికల ముందు తనకు ప్రజలంతా వలయంలా నిలబడి కాపాడాలని ఆదుకున్నాడు. కానీ పాపం పండిన రోజు ఎవరిని ఎవరు కాపాడలేరు అంటూ ట్వీట్ చేసారు.