చంద్రబాబుకు భవిష్యత్ కనిపిస్తోందని వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ నందిగం సురేష్ అన్నారు. చంద్రబాబు బాగోతం కొద్దీ రోజులుగా బయట పడుతోందని .. ఐటీ నోటీసులకు సమాధానం చెప్పకుండా ఆయన దొంగలా తిరుగుతున్నారని మండిపడ్డారు. తెలుగువారి ఆత్మ గౌరవం గురించి మాట్లాడే బాబు ఇప్పుడు ఎక్కడ తాకట్టు పెట్టారని ప్రశ్నించారు. చంద్రబాబుకి ఐటీ నోటీసులపై పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా వున్నారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌కి కూడా ఏమైనా ముడుపులు అందాయా అని నిలదీశారు. చంద్రబాబు ఇప్పటికైనా తన తప్పుని ఒప్పుకోవాలన్నారు. కోడ్ భాషలో చంద్రబాబు డబ్బులు సమకూర్చుకున్నారని ఎంపీ నందిగం సురేష్ ధ్వజమెత్తారు. చంద్రబాబును కచ్చితంగా అరెస్ట్ చేస్తారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ నిద్ర మేల్కో, ప్రశ్నించు అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. లోకేష్‌కు సిగ్గు, శరం ఉందా ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో అల్లర్లు, గొడవలు సృష్టిస్తున్నారని విమర్శించారు.