రిజిస్ట్రేషన్లలో ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా, నాణ్యమైన సేవలు అందించాలన్న సీఎం జగన్ ఆదేశాలతో అధికారులు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో సాంకేతికతను జోడించి విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఆన్లైన్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సేవలను విస్తృతంగా అందించనున్నారు. అత్యాధునిక కార్డ్ ప్రైం సాఫ్ట్వేర్, ఈ–స్టాంపింగ్, గ్రామ/వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలతో మరింత సులభతరమైన రిజిస్ట్రేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి 23 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దీనిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా సేవలు అందుబాటులోకి తేనున్నారు.