ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలకి అండగా నిలిచింది టీడీపీ మాత్రమే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 08, 2023, 01:52 PM

నంద్యాల పర్యటనలో భాగంగా మహిళా శక్తి హామీలపై మహిళలతో  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తిరుపతిలో మహిళలకు యూనివర్సిటీ ఏర్పాటు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆస్తిలో సమాన వాటా కోసం ఎన్టీఆర్ చట్టం తీసుకొచ్చారన్నారు. పార్లమెంటులో మహిళలకు 33 శాతం సీట్లు ఇవ్వాలనేది తన డిమాండ్ అని స్పష్టం చేశారు. ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్ తీసుకొచ్చానన్నారు. గతంలో మహిళలకు ఆర్ధిక స్వాతంత్య్ర ఉండేది కాదని.. ఆడ బిడ్డలను ఆర్ధికంగా నిలబెట్టాలని డ్వాక్రా సంఘాలను నెలకొల్పానని చెప్పారు. మహిళల మెదడులో మగవారి కంటే ఎక్కువ తెలివి తేటలు ఎక్కువ అని పరిశోధనల్లో తేలిందని... ఈ విషయాన్ని గూగుల్‌లో చూసినట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa