మధ్యప్రదేశ్‌లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్ వరకు ద్రోణి విస్తరించింది. రుతుపవన ద్రోణి తూర్పుభాగం ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుంది. దీంతో ఆదివారం ఉత్తర కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, ఉత్తరకోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.