ఏపీ సీఎం వైఎస్ జగన్పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘నేను జైలుకు వెళ్లాను కాబట్టి అందరూ జైలుకు వెళ్లాలనేలా జగన్ తీరు ఉంది. ఓ సైకో పాత్ ఆలోచనలు ఇలానే ఉంటాయి.. ఆయన క్రిమినల్ ఆలోచనలు కలిగిన వ్యక్తి’ అని ధ్వజమెత్తారు. ‘రాష్ట్ర దౌర్భాగ్యం ఏమిటంటే ఆర్థిక నేరాల్లో 16 నెలలు జైలులో ఉండి.. బెయిల్ మీద బయట తిరుగుతున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి’ అన్నారు.