తిరుమల శ్రీవారి దేవస్థానంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రావణ మాసం ముగుస్తుండడంతో భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి(ఉచిత దర్శనం) కోసం 18 గంటలు, ప్రత్యేక దర్శనం కోసం 4 గంటల సమయం పడుతోంది. కాగా ఆదివారం శ్రీవారిని 84,449 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.47 కోట్లు వచ్చింది.