టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా.. విజయవాడ బస్టాండ్ వద్దజనసేన నేత అమ్మిశెట్టి వాసు, ఇతర నాయకులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ.. అవినీతి ఎవరు చేసినా శిక్షించాలని.. కానీ రాజకీయ కక్షలతో రెండు రోజులుగా చంద్రబాబును తిప్పారని మండిపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే... సంతకాలు పెట్టిన అధికారులను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. జగన్ జైలుకు వెళ్లాడు కాబట్టే... అందరినీ పంపాలని చూస్తున్నారని మండిపడ్డారు.