మాజీ మంత్రి , టీడీపీ నేత పరిటాల సునీతను నేడు తెల్లవారుజామున పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వెంకటాపురం గ్రామంలో సునీత ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. పోలీసు నిర్బంధాన్ని దాటుకొని మరీ సునీత బయటికి వచ్చారు. టీడీపీ నాయకులతో కలిసి గ్రామం నుంచి రామగిరి వైపు ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనకు దిగారు.