చిత్తూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలు నిరసనలకు పూనుకున్నారు. ఇది తెలుసుకున్న పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. రోడ్లపైకి రానివ్వకుండా ఎక్కడెక్కడ అడ్డుకుంటున్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎస్ఆర్ పురంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తెల్లవారుజామున రోడ్లపైకి వచ్చి బంద్ నిర్వహించేందుకు ప్రయత్నించిన టీడీపీని పోలీసులు అడ్డుకుంటున్నారు. మండలాధ్యక్షుడు జయశంకర్ నాయుడు ఆధ్వర్యంలో మంటలు వేసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. టీడీపీ నేతలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. చిత్తూరు మండల టీడీపీ అధ్యక్షుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.